బస్తీ బాయ్ లవ్‌‌స్టోరీతో రిచ్ మూవీ..

బస్తీ బాయ్ లవ్‌‌స్టోరీతో రిచ్ మూవీ..

మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా  రాజా నరేంద్ర దర్శకత్వంలో   పద్మనాభ రెడ్డి, మార్గం గోపి కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.   ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌‌లైన్. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి గోపీ మోహన్, దశరథ్, వి సముద్ర,  డి ఎస్ రావు, మిట్టపల్లి సురేందర్  అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

ఈ సందర్భంగా  మోహిత్ పెడాడ మాట్లాడుతూ ‘ఈ  కథ చాలా కొత్తగా ఉంటుంది.  ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్‌‌లో ఉంటుంది. క్లైమాక్స్‌‌కి గూస్ బంప్స్ వస్తాయి.  ఈ మూవీ తర్వాత మేమంతా కూడా రిచ్ అవుతాం’ అని అన్నాడు. ఈ  సినిమాలో భాగం అవ్వడం ఆనందంగా ఉందని   హీరోయిన్  శ్రీజిత ఘోష్ చెప్పింది.  

దర్శకుడు రాజా నరేంద్ర మాట్లాడుతూ ‘ప్రస్తుత తరానికి నచ్చేలా బస్తీ బాయ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాం.  వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’ అని చెప్పాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు అన్నారు.