V6 News

మత్స్యకారుల జీవితాలపై సినిమానే ‘తెరచాప’

మత్స్యకారుల జీవితాలపై సినిమానే ‘తెరచాప’

నవీన్‌‌రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెరచాప’.  రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్  దుర్గం నిర్మించారు.  ఏప్రిల్ 17న సినిమా విడుదల. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  సముద్ర తీరాన బ్రతికే మత్స్యకారుల జీవితాలపై రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నవీన్‌‌రాజ్ అన్నాడు. ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందని హీరోయిన్లు చెప్పారు. సపోర్ట్ చేసిన వారందరికీ దర్శక నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.