పాకిస్తాన్ బాలాకోట్‌లో మళ్లీ యువతకు ఉగ్రవాద శిక్షణ

పాకిస్తాన్ బాలాకోట్‌లో మళ్లీ యువతకు ఉగ్రవాద శిక్షణ

గతేడాది పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్ర‌స్థావ‌రాల‌పై పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఇప్పుడు మళ్లీ బాలాకోట్ లో టెర్రర్ సంస్థ జైషే మొహమ్మద్ తన క్యాంపులను మళ్లీ యాక్టివ్ చేసింది. యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని… భారత్ పై దాడులకు పాల్పడేలా వీరిని తయారు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ సర్జికల్ దాడులు చేసిన స్థలంలోనే ఇప్పుడు జైషే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఈ టెర్రర్ క్యాంపులకు సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. భారత్ కు, హిందుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఇక్కడి క్యాంపులోనే ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. రవూఫ్ ను భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు హెడ్ గా… మసూద్ అజార్ నియమించాడు.