హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో 96.95% మంది క్వాలిఫై అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో కేయూ వీసీ ప్రతాప్ రెడ్డితో కలిసి టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఎడ్‌సెట్‌కు 35,600 మంది రిజిస్టర్ చేసుకోగా, 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు.
దీనిలో 28,446 మంది క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి, ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... గతేడాది రాష్ట్రంలో 196 బీఈడీ కాలేజీలు ఉండగా, 17,300 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 2 వారాల్లో అడ్మిషన్ రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
