కేయూ క్యాంపస్, వెలుగు: బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీజీ ఎడ్‌సెట్–-2026’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు సోమవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాలులో ఎడ్‌సెట్ చైర్మన్, కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి పరీక్షా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మే 12న రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. మంగళవారం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఓసీ, బీసీలు రూ.750 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఆ తర్వాత రూ.250 ఫైన్‌తో ఏప్రిల్ 27, రూ.వెయ్యి ఫైన్‌తో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. రూ.5 వేల ఫైన్‌తో మే 8, 9 తేదీల్లో కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్టు వివరించారు.
