- టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
- ‘స్ట్రక్చర్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం’ లాంచ్
హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధించాలంటే ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరి అని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. స్కూడెంట్లకు స్కిల్స్ పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా ‘స్ట్రక్చర్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం’ను మంగళవారం టీజీసీహెచ్ఈ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ లా కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులను ఇంటర్న్‌లుగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో కేవలం అకడమిక్ చదువులు మాత్రమే సరిపోవని, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ చాలా అవసరమని చెప్పారు. క్లాస్ రూమ్ లో నేర్చుకునే పాఠాలకు వాస్తవ ప్రపంచంలో ఉండే పని తీరుకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకే ఈ కార్యక్రమం రూపొందించామన్నారు.
ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడమే కాకుండా ప్రముఖ సంస్థల నుంచి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్లలో హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ గవర్నెన్స్, కరికులమ్ డెవలప్ మెంట్ అండ్ అకాడమిక్ రీఫామ్స్, లీడగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్స్, డేటా అనాలసిస్ అండ్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్.. తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని చైర్మన్ తెలిపారు.
