హైదరాబాద్‌‌ వాటర్‌‌‌‌ బోర్డులో 130 మేనేజర్‌‌ పోస్టులకు నోటిఫికేషన్ 

హైదరాబాద్‌‌  వాటర్‌‌‌‌ బోర్డులో 130 మేనేజర్‌‌ పోస్టులకు నోటిఫికేషన్ 
  • ఈ నెల 23 నుంచి ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ మెట్రోపాలిటన్‌‌ వాటర్‌‌ సప్లై అండ్‌‌ సీవరేజ్‌‌ బోర్డు ఇంజినీరింగ్‌‌ విభాగంలో 130 మేనేజర్‌‌ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌‌ సెక్రటరీ హరిత ప్రకటన జారీ చేశారు. మల్టీ జోన్‌‌–2 పరిధిలోని ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతన స్కేలు వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి అక్టోబర్‌‌ 17 వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌‌సైట్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హతలు, ఇతర పూర్తి వివరాలను కమిషన్‌‌ వెబ్‌‌సైట్‌‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.