‘తలైవి’ గా కంగనా.. ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్

‘తలైవి’ గా కంగనా..  ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్

మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ హిట్ తో ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా మొదలైంది.  ప్రముఖ కథానాయకుల, రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. అదే కోవలో అలనాటి అందాల నటి, తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘త‌లైవి’ గా పేరు పెట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోన్న కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. జ‌య‌ల‌లిత ఓల్డ్ గెట‌ప్‌ లో కంగ‌నా ర‌నౌత్  లుక్ అదిరిపోయింది. అర‌వింద‌స్వామి ఇందులో దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంజీ రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు.