ఐకాన్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ

ఐకాన్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ

రొమాంటిక్ మూవీ డీజే టిల్లులో తన నటన, అందం, అభినయంతోపాటు క్యూట్ లుక్‌తో సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది యువ నటి నేహా శెట్టి. ఈ అమ్మడు ఇప్పుడు బంపర్ ఆఫర్ ను దక్కించుకుంది. పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది.ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు వీరిద్దరూ కలిసి చేసిన కొత్త యాడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ యాడ్ ను హైదరాబాద్ లోని ప్రముఖ నోవాటెల్ హోటల్ లో చిత్రీకరించారు. 

మరిన్ని వార్తల కోసం

కేటీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి