మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి

గుజరాత్ లోని ఓ ఆర్మీ మెస్ లో ఓ జవాను తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో కాల్పులు జరిపి జవాన్ తో పాటు ఐదుగురు మరణించారు. మరో సైనికుడి పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్ లోని అమృత్ సర్ సమీపంలో ఉన్న ఖాసా గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. 

ఖాసాలోని 144 బెటాలియన్ మెస్ లో ఇవాళ దురదృష్టకర ఘటన జరిగిందని, మహారాష్ట్రకు చెందిన సట్టెప్ప అనే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన తోటి జవాన్లపై సడన్ గా ఫైరింగ్ ఓపెన్ చేశాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడిని నిలువరించేందుకు తోటి సైనికులు ప్రయత్నించే లోపు తనను తాను కాల్చుకుని కుప్పకూలిపోయాడని చెప్పారు. ఈ ఘటనలో ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని, సట్టెప్ప సహా ఐదుగురు మరణించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో జవానుకు అమృత్ సర్ గురు నానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం అతడి  పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తుకు (కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ) ఆదేశించినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

డోజ్‌‌‌‌కాయిన్లూ డొనేట్ చేయొచ్చు: ఉక్రెయిన్ రిక్వెస్ట్

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు

నన్నెవరూ అవమానించలేరు.. నేనెవరికీ నౌకర్ని కాదు