కర్ణాటకలోని గుల్బర్గాలోని బుద్ద దేవాలయంలో బుద్దుని దర్శించుకున్నారు మంత్రి వివేక్వెంకటస్వామి. ఆదివారం(ఫిబ్రవరి 1) 3వ బౌద్ధ దమ్మా యాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి.. అనంతరం బౌద్దప్రార్థనలలో పాల్గొన్నారు.బుద్దుని దర్శించుకోవడం మనసుకు చాలా ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి. బౌద్ద దమ్మా యాత్రలో భాగంగా బౌద్ధ బిక్షువులు కర్ణాటకలోని గుల్బర్గాలోని సిద్దార్థ బుద్ద విహారం నుంచి తెలంగానలోని నాగార్జున సాగర్బుద్దవనం వరకు పాదయాత్ర చేయనున్నారు.
తాను బుద్దిస్ట్ కాకపోయినా.. బుద్దిజాన్ని అనుసరిస్తానని చెప్పారు మంత్రి. బౌద్ద బిక్షువుల పాద యాత్ర తెలంగాణలో ప్రవేశించగానే తాను యాత్రలో పాల్గొంటానని చెప్పారు. దేశంలో శాంతిస్థాపనకు ఇలాంటి దమ్మా యాత్రలు అవసరం అన్నారు.ప్రేమ శాంతి , కర్మ, సందేశంలో ముందుకు సాగుతున్న బుద్దిజాన్ని అందరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన KCR విచారణ.. నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం
