ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వెనక ట్రంప్..! ఎప్ స్టీన్ ఈమెయిల్స్ లో ప్రస్తావన

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వెనక ట్రంప్..! ఎప్ స్టీన్ ఈమెయిల్స్ లో ప్రస్తావన

ఎప్​ స్టీన్​ సెక్స్​ స్కాండల్ మెయిల్స్​ మరోసారి ప్రకంపనలు సృష్టించాయి. అనేకమంది ప్రముఖుల పేర్లు, ప్రస్తావన ఈమెయిల్స్​ లో ఉన్నాయి. ఎప్ స్టీన్​ ఫైల్​ ట్రాన్సపరెన్సీ  చట్టం కింద అమెరికా న్యాయ శాఖ వెబ్ సైట్ లో ఈ డాక్యుమెంట్లు, వీడియోలు, పొటోలు ఉంచారు.  ఇప్పటికే ట్రంప్, బిల్‌ క్లింటన్, ఎలాన్‌ మస్క్, బ్రిటన్‌ మాజీ యువరాజు ఆండ్రూలకు సంబందించిన ఈమెయిల్స్​ వెలుగులోకి రాగా.. తాజాగా ప్రధాని మోదీకి సంబంధించిన మెయిల్స్​ను విడుదల చేశారు. అయితే ఈ మెయిల్స్​ లోని విషయాలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.  ఈ మెయిల్స్​ ను ఎప్ స్టీన్​ చెత్త ఊహాగానాలంటూ కొట్టిపారేసింది. 

అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన డజనుకు పైగా మెయిల్స్​ , ఫోన్ మేసేజ్ లలో భారత్, ప్రధాని మోదీ గురించి ఎప్​ స్టీన్​ ప్రస్తావించారు. 2017జూన్​ 25, 26 తేదీల్లో మోదీ, ట్రంప్​ సమావేశం, అదే ఏడాది జూలైలో ప్రధాని ఇజ్రాయెల్​ పర్యటనకు లింక్​ పెట్టాడు. అమెరికా అధ్యక్షుడి సలహా పాటించినందుకు ఇజ్రాయెల్​ టూర్​ సక్సెస్​ అయిందని చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | ఈసారి మాత్రం మూములుగా ఉండదు: అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్

అయితే ఎప్ స్టీన్​ ఫైళ్లు అని ఈమెయిల్స్​ లో ప్రధాని ఇజ్రాయెల్​ పర్యటన ప్రస్తావనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి ఎప్ స్టీన్​ చెత్త పుకార్లు తప్ప మరేమీ కాదని తోసిపుచ్చింది.  
మిలియనీర్, మైనర్లపై సెక్స్ స్కాండల్​ లో దోషి ఎప్​ స్టీన్​కార్యకాలాపాలపై దర్యాప్తులో భాగంగా యూఎస్​ న్యాయశాఖ దాదాపు 30లక్షల పేజీల ఈమెయిల్స్​లో ప్రధాని మోదీ టూర్​ప్రస్తావన కూడా ఉంది.  ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్​పర్యటన వెళ్లే సందర్భంగా ఈ మెయిల్స్​ చర్చనీయాంశంగా మారాయి.