డోజ్‌‌‌‌కాయిన్లూ డొనేట్ చేయొచ్చు!

డోజ్‌‌‌‌కాయిన్లూ డొనేట్ చేయొచ్చు!

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రష్యాతో జరుగుతున్న గొడవలో ఫైనాన్షియల్ సాయం పొందేందుకు  ఉక్రెయిన్  క్రిప్టోల బాట పట్టింది. తమకు సపోర్ట్ చేయడానికి డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్లను డొనేట్ చేయొచ్చని చెబుతోంది. బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌, ఎథరమ్‌‌‌‌‌‌‌‌, టెతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోలనా, పోల్కాడాట్‌‌‌‌‌‌‌‌ క్రిప్టోలను డొనేషన్ల కింద తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఈ దేశం, తాజాగా ఈ లిస్టులో డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌ను యాడ్ చేసింది. ‘డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్ వాల్యూ రూబుల్ వాల్యూని క్రాస్ చేసింది. ఈ మెమ్‌‌‌‌‌‌‌‌కాయిన్ డొనేషన్లను అంగీకరిస్తాం.  రష్యా ఆక్రమిత దారుల నుంచి తమ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి ఈ మెమ్‌‌‌‌‌‌‌‌ కూడా సపోర్ట్ అందించొచ్చు’ అంటూ ఉక్రెయిన్ వైస్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైఖైలో ఫెడోరొవ్‌‌‌‌‌‌‌‌ ట్వీట్ చేశారు. ఆయన  ఎలన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌ను ట్యాగ్ చేశారు. కాగా, ఇప్పటి వరకు క్రిప్టో డొనేషన్ల కింద 40 మిలియన్ డాలర్లు ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు అందాయని అంచనా. డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌ను అంగీకరిస్తామని ఉక్రెయిన్ ప్రకటించినప్పటికీ, డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్ వాల్యూ పెద్దగా పెరగలేదు.  డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్ శనివారం 3 శాతం తగ్గి 0.12 సెంట్ల వద్ద ట్రేడవుతోంది. కానీ,  క్రిప్టో డొనేషన్ల లిస్టులో డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్ కూడా యాడ్ కావడంతో డోజ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు.

బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌..
రష్యాపై వెస్ట్రన్‌‌‌‌‌‌‌‌ దేశాలు ఆంక్షలు పెట్టడంతో రష్యన్ కరెన్సీ రూబుల్‌‌‌‌‌‌‌‌ వాల్యూ పడుతుండగా, మరోవైపు బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌కు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. కరెన్సీల మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్యాప్‌‌‌‌‌‌‌‌ పరంగా చూస్తే, రూబుల్ ర్యాంక్ 17 కి పడిపోయింది. బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ మాత్రం 14 కి ఎగిసింది. రూబుల్‌‌‌‌‌‌‌‌ను వాడుతూ బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్లను ట్రేడ్ చేయడం విపరీతంగా పెరుగుతోంది. రష్యన్లు తమ డబ్బులను బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ స్విస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో లీగల్‌‌‌‌‌‌‌‌ కరెన్సీగా బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌..
బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌, టెతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను లీగల్‌‌‌‌‌‌‌‌ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కరెన్సీ) గా  చేయాలని స్విస్‌‌‌‌‌‌‌‌ సిటీ లుగానో ప్లాన్స్ వేస్తోంది. ఈ సిటీ సొంత ఎల్‌‌‌‌‌‌‌‌వీజీఏ టోకెన్‌‌‌‌‌‌‌‌ను కూడా తీసుకొస్తోంది. స్టేబుల్ కాయిన్‌‌‌‌‌‌‌‌ ఇష్యూ చేసే టెతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సిటీ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకుంది. సిటిజన్లు, కంపెనీలు తమ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లను, పార్కింగ్ టికెట్స్‌‌‌‌‌‌‌‌, ట్యూషన్‌‌‌‌‌‌‌‌ ఫీజులను క్రిప్టో కరెన్సీల్లో చెల్లించడానికి వీలుంటుందని  ఈ సిటీ గవర్నమెంట్ ప్రకటించింది.