అమెరికాకు భారత్ మంచి మిత్రదేశం కాదు

అమెరికాకు భారత్ మంచి  మిత్రదేశం కాదు

వాషింగ్టన్: సౌత్ కరోలినా గవర్నర్, రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కుమారుడు నలిన్ హేలీ భారత్‌‌‌‌‌‌‌‌పై తీవ్ర విమర్శలు చేశాడు. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌కు భారత్ మంచి మిత్రదేశం కాదని పోస్ట్​ చేశాడు. తనను తాను మేక్​అమెరికా గ్రేట్​అగైన్(ఎంఏజీఏ) ప్రతినిధిగా చెప్పుకునే నలిన్.. శుక్రవారం ఇండియన్ -అమెరికన్ పాలిటికల్ ఫిగర్ వివేక్  రామస్వామి గురించి ఒక వీడియోను కోట్ చేస్తూ ఈ పోస్ట్​ పెట్టాడు. ఇరాన్ నుంచి చమురు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూ.. భారత్ అమెరికాకు చీప్ ​లేబర్​ను పంపుతోందని ఆరోపించాడు.

అలాగే, ఈ సమస్య కేవలం భారత్‌‌‌‌‌‌‌‌కు సంబంధించినది మాత్రమే కాదని, అమెరికా ఇతర మిత్రదేశాలతో ఉన్న సంబంధాలను కూడా పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.