ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి  వంట చేయొచ్చు

దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ను ముంబయి (బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌)లో 18.5 ఎకరాలలో విస్తరించిన జియో వరల్డ్‌ సెంటర్‌లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శుక్రవారం ప్రారంభించింది. ఇందులో 1.61 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో మూడు ఎగ్జిబిషన్‌ హాళ్లు, 1.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు కన్వెన్షన్‌ హాళ్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్‌ కేంద్రం 5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుందని రిలయన్స్‌ వెల్లడించింది. ముంబయి నగరానికి ధీరూభాయ్‌ అంబానీ స్క్వేర్‌, ఫౌంటెయిన్‌ ఆఫ్‌ జాయ్‌లను అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫౌంటెయిన్‌లో 8 ఫైర్‌ షూటర్లు, 392 వాటర్‌ జెట్‌లు, 600కు పైగా LED లైట్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్‌ కేంద్రంలోని వంటశాల ద్వారా రోజుకు 18,000 మందికి పైగా ఆహారం అందించే సౌలభ్యం ఉంది.