టీఆర్ఎస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి

టీఆర్ఎస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి

టీఆర్ఎస్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ ది ఫ్యూడల్ పాలన అని, ఈ సర్కారులో సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీమీడియా పాయింట్లో మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులపై అరాచకాలు పెరిగాయన్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ దళితులను అండగా ఉందన్నారు. నేరెళ్లఘటన, గజ్వేల్‌లో దళిత రైతు ఆత్మహత్య వంటివి సర్కారు తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నా యని విమర్శించారు. దళితులపై దాడులకు సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణకు ద్రోహం చేస్తుండు

తెలంగాణ సాధించుకున్నదే మన నీళ్ళను మనం ఉపయోగించుకోవడానికని.. అలాంటిది రాయలసీమ లిఫ్ట్ద్వారా ఏపీ శ్రీశైలం నీటిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నా కేసీఆర్ అడ్డుకోవడం లేదని భట్టి విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ను వాయిదా వేయాలనడం కుట్రపూరి తమని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహిఅని మండిపడ్డారు.

కరోనా కట్టడిలో పూర్తిగా ఫెయిల్

గ్రామాల్లో కరోనా విజృంభిస్తున్నా సర్కారుని యంత్రణలో పూర్తిగా ఫెయిలైందని భట్టిమండి పడ్డారు. సర్కారు కరోనాను కంట్రోల్ చేయడం వదిలేసి.. ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడంపైనే దృష్టి పెట్టిందన్నా రు. తాము ఆందోళనలకు పిలుపునిస్తే.. కరోనా గైడ్ లైన్స్ అడ్డుపెట్టుకొని అడ్డు తగులుతున్నారని విమర్శించారు.గ్రామాల్లో కరోనా పేషెంట్లుహోం క్వారంటైన్ ఉండటం కష్టమని, వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు. అందువల్లప్రతి నియోజకవర్గంలో ఒక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోనే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ సర్కారేనని విమర్శించారు.