చెన్నై: తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 70 ఏళ్ల ద్రవిడ పార్టీల కోటలు బద్దలుకొట్టి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు చేరుకుంది. దీంతో విజయ్ తమిళనాడు సీఎం కావడం దాదాపు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే విజయదుందుభి మోగిస్తోన్న వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందే టీవీకే విజయం తథ్యమని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు.
ఓ తమిళ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ ‘‘మీరు రాసిపెట్టుకోండి. మళ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో ప్లే చేయండి. విజయ్ సింగిల్‌గా వెళ్తాడు. కచ్చితంగా 118 సీట్లు గెలుస్తాడు’’ అని జోస్యం చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పింది అక్షరాల నిజం అవుతుంది. విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి నిలిచాడు.
ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా తమిళనాడులో వేళ్లునానుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని టీవీకే పార్టీని విజయం దిశగా నడిపించాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పీకే చెప్పినట్లుగానే విజయ్ టీవీకే పార్టీ 100 నుంచి 120 సీట్లు గెలిచి అవకాశం ఉంది. టీవీకే ప్రభంజనం సృష్టిస్తుండటంతో విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు పీకే వీడియోను షేర్ చేస్తున్నారు.
విజయ్‌కు ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పీకే
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ విజయ్ కోసం ప్రశాంత్ కిషోర్ బృందం పనిచేసింది. 2025, ఫిబ్రవరిలో జరిగిన టీవీకే పార్టీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ.. మహేంధ్ర సింగ్ ధోనీ సీఎస్కే ని గెలిపించినట్లు నేను విజయ్ టీవీకేని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు. విజయ్ పార్టీని గెలిపిస్తే ధోనీ కన్నా తనకే పాపులారిటీ తమిళనాడులో వస్తుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో విజయ్ గెలుపు ఖాయమన్నారు. తమిళం నేర్చుకుని విజయ్ టీవీకే పార్టీ విజయోత్సవ సభలో మాట్లాడుతానని పీకే పేర్కొన్నారు.
visionary pic.twitter.com/HlHBGftl6y
— Sripaad R (@sripaad125) May 4, 2026
