నిరాశపర్చిన టూవీలర్ అమ్మకాలు

నిరాశపర్చిన టూవీలర్ అమ్మకాలు

న్యూఢిల్లీ:చిప్స్​, ఇతర విడిభాగాల కొరత కారణంగా గత నెల కొన్ని ఆటోమొబైల్ కంపెనీల బిజినెస్ దెబ్బతింది.  మారుతీ, హ్యుండై, టొయోటా, హోండా అమ్మకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు అమ్మకాలు రెండంకెల గ్రోత్​ సాధించాయి.  టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా,  ఎంజీ మోటార్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో హోల్​సేల్​ అమ్మకాలను పెంచుకున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) దేశీయ అమ్మకాలు ఫిబ్రవరి 2021లో 1,52,983 యూనిట్ల నుంచి 8.46 శాతం తగ్గి 1,40,035 యూనిట్లకు పడిపోయాయని తెలిపింది. "ఎలక్ట్రానిక్ భాగాల కొరత ప్రధానంగా దేశీయ మార్కెట్లో  వెహికల్స్ ప్రొడక్షన్​పై ప్రభావం చూపింది. ప్రొడక్షన్​ పెంచడానికి అన్ని చర్యలనూ తీసుకుంటున్నాం" అని కంపెనీ తెలిపింది. ఆల్టో,  ఎస్-ప్రెస్సోతో కూడిన కంపెనీ మినీ కార్ల అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 23,959గా ఉండగా, గత నెలలో 17.81 శాతం తగ్గి 19,691 యూనిట్లకు పడిపోయాయి.  స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో  డిజైర్ వంటి కాంపాక్ట్ మోడళ్ల డిస్పాచ్​లు ఫిబ్రవరి 2021లో 80,517 కార్ల నుండి 3.38 శాతం తగ్గి 77,795 యూనిట్లకు పడిపోయాయి.విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్  ఎర్టిగాతో సహా యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు కూడా 26,884 యూనిట్ల నుండి 25,360 యూనిట్లకు తగ్గాయి.

టాటా మోటార్స్ ఓకే..

టాటా మోటార్స్ ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు 47 శాతం పెరిగి 39,981 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27,225 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు ఫిబ్రవరి 2021లో 15,391 యూనిట్ల నుంచి గత నెలలో 80 శాతం పెరిగి 27,663 యూనిట్లకు చేరుకున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఎస్​యూవీలు సహా అన్ని విభాగాలు 79 శాతం గ్రోత్​ సాధించాయని, ఇక నుంచి డిమాండ్ బాగుంటుందని అనుకుంటున్నామని  కంపెనీ తెలిపింది.  సెమీకండక్టర్, -సంబంధిత విడిభాగాల సరఫరాను పరిశీలిస్తూనే ఉన్నామని, వీటిని అందుబాటులోకి తేవడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎం&ఎం పేర్కొంది.  స్కోడా ఆటో ఇండియా గత నెలలో 4,503 యూనిట్లను అమ్మింది. ఈసారి తమ అమ్మకాలు ఐదు రెట్లు పెరిగాయని తెలిపింది. యూఎస్​వీ కుషాక్ అమ్మకాలు భారీగా ఉన్నాయని ప్రకటించింది. ఎంజీ మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 5 శాతం గ్రోత్​తో 4,528 యూనిట్లకు పెరిగాయి. ఈ  సంస్థ ఫిబ్రవరి 2021లో 4,329 యూనిట్లను అమ్మింది. గత నెలలో దేశీయ మార్కెట్లో 2,456 యూనిట్లను అమ్మినట్టు నిస్సాన్ ఇండియా తెలిపింది.

తగ్గిన టీవీఎస్​, బజాజ్​​టూ వీలర్​​ అమ్మకాలు

టీవీఎస్​ మోటార్​ అమ్మకాలు ఐదు శాతం తగ్గి 2,81,714 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 2,97,747 యూనిట్లు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్​ సేల్స్​ 2,84,581 యూనిట్ల నుంచి 2,67,625  యూనిట్లకు పడిపోయాయి. డొమెస్టిక్ టూ వీలర్ల సేల్స్​ 1,95,145 యూనిట్ల నుంచి 1,73,198 యూనిట్లకు తగ్గింది. అంటే అమ్మకాలు 11 శాతం పడ్డాయి.   టూ వీలర్​ డొమెస్టిక్​ సేల్స్​ 14 శాతం తగ్గి 1,35,496 యూనిట్లకు పడిపోయాయి.