టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇది 3 బ్యాటరీ ఎంపికలు.. -- 2.2 కిలోవాట్అవర్, 3.4కిలోవాట్అవర్ 5.1 కిలోవాట్ అవర్‌లో అందుబాటులో ఉంటుంది. కొత్త 2.2 కిలోవాట్అవర్ బ్యాటరీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.94,999తో ప్రారంభమవుతుంది. ఇది గరిష్టంగా 75 కి.మీ వేగంతో వెళ్తుంది. ఐదు ఇంచుల స్క్రీన్, ఫాస్ట్‌చార్జింగ్, 950 వాట్ల చార్జర్, 30 లీటర్ల స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
