మూడో రోజూ పుంజుకున్న మార్కెట్లు

మూడో రోజూ పుంజుకున్న మార్కెట్లు
  •     ఆటో, మెటల్ షేర్లలో ర్యాలీ
  •     సెన్సెక్స్ 328 పాయింట్లు జంప్​

ముంబై: ఇండెక్స్ మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా పలు షేర్లు పెరగడం, రిటైల్​ ద్రవ్యోల్బణం తగ్గడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ దూసుకెళ్లాయి. దీంతో మంగళవారం బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ 328 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 22,200 స్థాయికి ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 328.48 పాయింట్లు పెరిగి 73,104.61 వద్ద స్థిరపడింది. డే ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో ఇది 510.13 పాయింట్లు ర్యాలీ చేసి 73,286.26 గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లోని 20 షేర్లు లాభాలతో ముగియగా, 10 క్షీణించాయి. నిఫ్టీ 113.80 పాయింట్లు పెరిగి 22,217.85 వద్ద స్థిరపడింది. 

ఇందులోని 36 షేర్లు లాభపడగా, మిగతా 14 నష్టపోయాయి. ప్రాఫిట్​బుకింగ్ వల్ల​ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌సీజీ, ఫార్మా షేర్లు క్షీణించగా, మెటల్, ఆటో షేర్లు లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ నుంచి, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్​ టూబ్రో, జేఎస్​డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్  మారుతీ లాభపడ్డాయి. అయితే, నెస్లే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వెనుకబడి ఉన్నాయి. 

రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 11 నెలల కనిష్ట స్థాయి 4.83 శాతానికి తగ్గింది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ,  రిటైల్​ ద్రవ్యోల్బణం తగ్గడంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి అనుకూలమైన సంకేతాల సహాయంతో దేశీయ మార్కెట్లు పుంజుకుంటున్నాయని చెప్పారు. బ్రాడ్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో, బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.79 శాతం  మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం పెరిగింది. 

సూచీలలో యుటిలిటీస్ 2.80 శాతం, పవర్ 2.51 శాతం, ఇండస్ట్రియల్స్ 2.40 శాతం, టెలికమ్యూనికేషన్ 2.27 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.11 శాతం, కమోడిటీస్ 1.87 శాతం, సేవలు 1.78 శాతం, శక్తి 1.52 శాతం,  రియల్టీ 1.03 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్  టోక్యో లాభాల్లో స్థిరపడగా, షాంఘై,  హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సోమవారం వాల్ స్ట్రీట్ మిశ్రమంగా ముగిసింది.