
- నాలుగో క్వార్టర్లో రూ. 2,072 కోట్లు
న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్‌కు మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌గా లాభం 31 శాతం తగ్గి రూ. 2,072 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,005.6 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం 4.4 శాతం పెరిగి రూ.37,599.1 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2024తో ముగిసిన సంవత్సరానికి, లాభం (2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,346 కోట్లు) వార్షికంగా10.5 శాతం తగ్గి రూ. 7,467 కోట్లకు పడిపోయింది. 2022-–23లో కంపెనీ కార్యకలాపాల ద్వారా వార్షిక ఆదాయం 7.7 శాతం పెరిగి రూ.1,39,144.8 కోట్ల నుంచి రూ.1,49,982.4 కోట్లకు చేరింది. కంపెనీ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.