హైదరాబాద్, వెలుగు: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లిమిటెడ్ 2025 డిసెంబర్‌తో ముగిసిన మూడవ క్వార్టర్ లో రూ.760 కోట్ల నికరలాభం సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరిగింది.
కంపెనీ రిటైల్ లోన్ల పోర్ట్‌ఫోలియో 21 శాతం వృద్ధితో రూ.1,11,990 కోట్లకు చేరింది. ఈ కాలంలో రికార్డు స్థాయిలో రూ.22,701 కోట్ల రిటైల్ లోన్లు ఇచ్చింది. టూవీలర్, ఫార్మ్ ఫైనాన్స్ రంగాల్లో కూడా మంచి వృద్ధి నమోదైంది.
ప్లానెట్ యాప్ డౌన్‌లోడ్లు 2.20 కోట్లు దాటాయి. సంస్థ సైక్లోప్స్, నోస్ట్రడమస్ వంటి ఏఐ ప్రాజెక్టుల ద్వారా సేవలను మెరుగుపరుస్తోంది.
