Ram Gopal Varma: 'జై హో' సాంగ్ రెహమాన్ కంపోజ్ చేసింది కాదా?.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Ram Gopal Varma: 'జై హో' సాంగ్ రెహమాన్ కంపోజ్ చేసింది కాదా?.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

భారతీయ సినీ ప్రపంచంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయం. 'రంగీలా' మూవీ నుంచి మొదలైన వీరిద్దరి ప్రయోణం ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కానీ రెహమాన్ తో పనిచేయడమంటే అంత ఈజీ కాదు. అది ఎంతో ఓపికతో కూడుకున్న వ్యవహారమని వర్మ అన్నారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్యూలో రెహమాన్ వ్యక్తిత్వం, పనితీరుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

సుభాష్ ఘై ఆగ్రహం.. 

ఒకప్పుడు బాలీవుడ్ అగ్ర దర్శకుడు సుభాష్ ఘై 'యువరాజ్' సినిమా కోసం రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారని వర్మ తెలిపారు. సాధారణంగా రెహమాన్‌కు రాత్రిపూట పనిచేసే అలవాటు ఉంది. పైగా ఆ పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకునేవారు. ఈ జాప్యం పట్ల సుభాష్ ఘై తీవ్ర అసహనంతో ఉండేవారని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.. ఒకరోజు రెహమాన్ స్టూడియోకు వచ్చేసరికి అక్కడ గాయకుడు సుఖ్వీందర్ సింగ్ ఉన్నారు. రెహమాన్ రాగానే చాలా క్యాజువల్‌గా సుఖ్వీందర్‌ను చూసి, నువ్వు ఏదైనా ట్యూన్ కంపోజ్ చేశావా? అని అడిగారట. సుఖ్వీందర్ ఒక ట్యూన్ వినిపించగా, అది నచ్చిన రెహమాన్.. పక్కనే ఉన్న సుభాష్ ఘైతో  ఈ ట్యూన్ బాగుంది కదా, మీకు నచ్చిందా? అని అడిగినట్లు ఆర్జీవీ తెలిపారు.. 

Also Read : 'మీ విజిల్స్, చప్పట్లే నా శక్తి'.. 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

దీంతో సుభాష్ ఘైకి కోపం కట్టలు తెంచుకుంది. నేను మీకు మూడు కోట్లు ఇచ్చింది నువ్వు మ్యూజిక్ ఇస్తావని.. సుఖ్వీందర్ ట్యూన్ ఇవ్వడానికి నువ్వెందుకు? అని కేకలు వేసినట్లు ఆర్జీవీ గుర్తుచేశారు. దానికి రెహమాన్ మిస్టర్ ఘై.. మీరు ఇచ్చే డబ్బులు నా పేరు కోసం, నా పని కోసం కాదు. అది గుర్తుంచుకోండి. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే నేను ఇంకో ట్యూన్ ఇస్తాను. ఆ మాట అనేసి రెహమాన్ వెంటనే అక్కడి నుంచి చెన్నైకి వెళ్లిపోయారని సుఖ్వీందర్ తనతో తెలిపినట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

సుఖ్వీందర్ ట్యూన్.. 'జై హో' !

ఆ తర్వాత రెహమాన్ చెన్నై నుంచి సుఖ్వీందర్‌కు ఫోన్ చేసి, ఆ ట్యూన్‌ను పూర్తి చేసి తనకు పంపమని చెప్పారట. సరిగ్గా ఏడాది తర్వాత, సుఖ్వీందర్‌కు రెహమాన్ మేనేజర్ నుంచి రూ. 5 లక్షల చెక్కు అందింది. ఎందుకని అడిగితే.. నువ్వు చేసిన ఆ పాటను రెహమాన్ ఒకరికి అమ్మారు, అందులో నీ వాటా ఇది అని చెప్పారు. ఆ పాట మరేదో కాదు.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన 'జై హో'. సుభాష్ ఘై వద్దన్న ఆ ట్యూనే 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాలో వాడినట్లు ఆర్జీవీ తెలిపారు. ఆపాటే ఆస్కార్ వేదికపై భారతీయ జెండాను రెపరెపలాడించిందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

వివాదాల నడుమ కుటుంబం మద్దతు

ఇటీవల బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష, 'ఛావా' సినిమాకు సంబంధించిన అంశాలపై రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయనపై కొందరు తీవ్ర విమర్శలు చేయగా.. మరి కొందరు మద్దతు తెలిపారు. దీనికి రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమ కుటుంబానికి అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే వివాదాలు ఎన్ని ఉన్నా, రెహమాన్ సృష్టించే సంగీతం మాత్రం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుందని ఆర్జీవీ కొనియాడారు

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollyGupSip (@bollygupsip)