బంగారం కూడా వెండితో ర్యాలీలో తగ్గేదేలేదు అన్నట్లుగా పెరుగుతూనే ఉంది. ఒక్క రాత్రిలోనే తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు అమాంతం రూ.5వేలకు పైగా పెరగటంతో భారతీయులు అవాక్ అవుతున్నారు. దీంతో గ్రాము బంగారం రేటు రూ.15వేలు క్రాస్ చేసి దూసుకుపోతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన కాలంలో తీసుకున్న అనేక వివాదాస్పదమైన, ఆందోళనలు ప్రేరేపించే నిర్ణయాలతో పాటు ఇతర భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈ లోహాల ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్పాట్ మార్కెట్లో కూడా బంగారం, వెండి గతంలో ఎన్నడూ లేని భారీ పెరుగుదలను నమోదు చేశాయి.
ALSO READ : బ్రేకులు లేని వెండి.. డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ..
జనవరి 21న బంగారం రేట్లు పెరిగి కొనుగోలుదారులకు భారీగా షాక్ ఇస్తున్నాయి. దీంతో జనవరి 20 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.502 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 480గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 190గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : 2030 నాటికి అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశంగా భారత్..
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ అదే దూకుడుతో కొనసాగుతోంది. ఒక్క రోజులోనే కేజీకి రూ.5వేలు రిటైల్ మార్కెట్లో పెరిగి కొనే దమ్ము ఉందా అన్నట్లుగా కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే బుధవారం జనవరి 21, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 40వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.340 వద్ద ఉంది.
