ఆన్ లైన్ గేమ్స్ కి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా జనాల్లో మార్పు రావడంలేదు. ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడి అప్పులపాలయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బెట్టింగ్ లకు బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంకు చెందిన కోట్ల లక్ష్మీకాంత్ (24) అనే యువకుడు స్నానం చేస్తానని చెప్పి ఇంట్లోని బాత్రూంకు వెళ్లి, అక్కడ ఉన్న ఇనుప రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక వివరాల ప్రకారం, మృతుడు ఏడాదినుంచి బెట్టింగ్‌లకు అలవాటుపడి లక్షల్లో ఆర్థికంగా నష్టపోయి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి అన్న కోట్ల రవి ఫిర్యాదు మేరకు మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి పరిశీలించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : మొగుడి నాలుకను పళ్లతో కొరికి విసిరేసిన భార్య..!
జనవరి 12న షాద్ నగర్ కేశంపేట మండల పరిధిలో ఆన్ లైన్ గేమ్స్ కు బానిసన ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. బిహార్ రాష్ట్రానికి చెందిన గుడ్డు కుమార్ యాదవ్ కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ కు బానిసై కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 6న అదృశ్యమైన యువకుడి మృతదేహం కేశంపేట మండలం చౌలపల్లి రహదారి సమీపంలో చెట్టుపై వేలాడుతుండగా గుర్తించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
