ఇది నిజంగా రాక్షసినే.. : మొగుడి నాలుకను పళ్లతో కొరికి విసిరేసిన భార్య..!

ఇది నిజంగా రాక్షసినే.. : మొగుడి నాలుకను పళ్లతో కొరికి విసిరేసిన భార్య..!

దేవడా.. ఇదేం ఘోరం అనుకునే రోజులు ఇవి.. మొగుడితో గొడవ జరిగిన తర్వాత.. మొగుడి నాలుకను పళ్లతో కట్ చేసి మరీ విసిరేసింది పెళ్లాం.. నాలుకను అంతలా ఎలా కట్ చేసింది.. ఇది రాక్షసా ఏంటీ అనే భయం పెట్టిందా.. అవును.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు తెలిస్తే మీరే అవాక్కవుతారు.. అయ్య బాబోయో అంటూ గుండెలపై చెయ్యి వేసుకుంటారు.. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా మోడీనగర్ సంజయ్ పురి కాలనీ. విపిన్, ఇషా భార్యభర్తలు. ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది. పెళ్లి అయితే అయ్యింది.. రోజూ గొడవలే అంట. ఈ క్రమంలోనే 2026, జనవరి 19వ తేదీ రాత్రి.. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు విపిన్. తినటానికి గుడ్డు కూర చేయమని చెప్పాడు. అంతే.. అంతెత్తున లేచింది ఇషా. నేను ఎప్పుడూ గుడ్డు కూర వండలేదు.. నాకు వండటం రాదు.. నేను చేయను అంటూ తెగేసి చెప్పింది. సహజంగా ఇద్దరూ గొడవ పడ్డారు. ఇంతలో విపిన్ తల్లిదండ్రులు వచ్చి సర్దిచెప్పారు. ఆ తర్వాత విపిన్, ఇషా ఇద్దరూ అన్నం తినకుండా తమ గదిలోకి వెళ్లి పడుకున్నారు.

ALSO READ : బస్సు ఎక్కాలంటే భయపడుతున్న మగ జాతి

అర్థరాత్రి మళ్లీ పెద్ద అరుపులు.. విపిన్ కేకలు వేయటం వినిపించింది. ఇంట్లోని తల్లిదండ్రులతోపాటు చుట్టుపక్కల వాళ్లు ఇంటికి వచ్చి.. విపిన్ గదిలోకి వెళ్లి చూశారు. విపిన్ నోట్లో నుంచి రక్తం కారుతుంది. గదిలో తిగి పడిన నాలుక కనిపించింది. అందరూ షాక్.. ఇదే సమయంలో ఇషా నోట్లో నుంచి రక్తం కారుతుంది. ఏంటీ అని అడిగితే.. నేనే నాలుకను పళ్లతో కట్ చేశాను అని చెప్పింది. అందరూ వణికిపోయారు. భయపడ్డారు. వెంటనే విపిన్ ను ఆస్పత్రికి తరలించారు. తెగి పడిన నాలుకను కవర్ లో పెట్టి.. ఆస్పత్రిలో డాక్టర్లకు చూపించారు. 

పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. అక్కడ విపిన్ పేరంట్స్.. తమ కోడలు ఇషాపై చెప్పిన విషయాలు మరీ షాకింగ్. రోజూ రీల్స్ చేస్తూ ఉంటుంది.. పని చేయదు.. భర్తను దగ్గరకు రానివ్వదు.. ఏమైనా గట్టిగా అంటే చంపుతాను అని బెదిరిస్తుంది.. ఇంట్లోనే నా కోడలు ఇషా మందు కొడుతుంది.. సిగరెట్లు తాగుతుంది.. మందు, సిగరెట్లు తీసుకురావాలని నా కొడుకును కొడుతుంది అంటూ కన్నీళ్లతో.. బాధతో.. ఆవేదనతో.. ఆందోళనతో చెప్పుకొచ్చారు. కోడలు వ్యవహారం అంతా విని పోలీసులకే చెమటలు పట్టాయి. 

విషయం కోడి గుడ్డు కూర కాదని.. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. భర్త విపిన్ తో ఉండటం ఇష్టం లేదని తేల్చారు. ఈ విపిన్ నాలుక కట్ అయిన విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఈ వ్యవహారం, ఘటన చూసినోళ్లు.. తెలిసినోళ్లు.. అమ్మ బాబోయ్.. ఇది ఆడదా.. రాక్షసినా అంటున్నారు.