పదేండ్లలో కేటీఆర్.. సికింద్రాబాద్ ను పట్టించుకోలే: కవిత

పదేండ్లలో కేటీఆర్.. సికింద్రాబాద్ ను పట్టించుకోలే: కవిత

సికింద్రాబాద్ ను జిల్లా చేయాలంటున్న కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత .పదేండ్లలో కేటీఆర్ ఏనాడు సికింద్రాబాద్ ను పట్టించుకోలేదని విమర్శించారు. ఆనాడు  జిల్లా కావాలన్న వారిని అణిచివేసి జైల్లో వేశారని ..ఇవాళ కొత్తగా సికింద్రాబాద్ ను జిల్లా చేయాలని కేటీఆర్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. 

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం రావొద్దనే ఫోన్ ట్యాపింగ్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు కవిత. సిట్ విచారణతో తమలాంటి బాధితులకు  న్యాయం జరుగుతుందనుకోవడం లేదన్నారు.  42 శాతం రిజర్వేషన్లను పక్కదారి పట్టించేందుకే  ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో   తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదన్నారు.  మున్సిపల్ ఎలక్షన్లలో బీసీలు , ఆడబిడ్డలు కోరితే మద్దతిస్తామని చెప్పారు కవిత.  బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు.

ట్యాంక్ బండ్ పై తెలంగాణ అమరవీరుల ఫోటోలో ఉండాలని సూచించారు. ముచ్చెర్ల సత్యనారాయణ స్ఫూర్తితో తాము ముందుకెళ్తామన్నారు.