ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి సభలో షాక్ సర్క్యూట్

ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి సభలో షాక్ సర్క్యూట్

జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిప్యూటీ సీఎం సభలో షాక్ సర్క్యూట్ జరిగింది.  సభ కోసం ఏర్పాటు చేసిన ఒక స్పీకర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో  పొగలు వ్యాపించాయి.  వెంటనే అప్రమత్తమైన అధికారులు,సిబ్బంది ఆ స్పీకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. అప్పటికి సభ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని,ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు వెల్లడించారు.

ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపర్యటిస్తున్నారు. ముందుగా  ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.  భట్టితో పాటు మంత్రులు తుమ్మల,అడ్లూరి లక్ష్మణ్,రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.