LIC ఆఫీసులో జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదు.. పై అధికారిని చంపటం కోసం తగలబెట్టిన మరో ఉద్యోగి

LIC ఆఫీసులో జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదు.. పై అధికారిని చంపటం కోసం తగలబెట్టిన మరో ఉద్యోగి

తమిళనాడులోని మధురై LIC ఆఫీసు బిల్డింగ్ లో జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదని.. ఇది పక్కా హత్య అని.. కుట్ర ఉందని తేల్చారు పోలీసులు. మహిళా ఉన్నతాధికారిని చంపటం కోసం మరో ఉద్యోగి చేసిన హత్యాకాండ అని స్పష్టం చేయటంతో LIC కంపెనీలోని సిబ్బందితో తమిళనాడు మొత్తం షాక్ అయ్యింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 

తమిళనాడులో ని మధురై ఎల్‌ఐసీ ఆఫీసులో జరిగి ఫైర్ యాక్సిడెంట్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో ఎల్ఐసీ ఆఫీసర్ కళ్యాణి నంబి  మంటల్లో కాలి చనిపోయారు. అయితే  పోలీసులు విచారణలో అది ప్రమాదం కాదని.. ఆమెను చంపేందుకు అదే ఆఫీసులో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగి పక్కా ప్లాన్ తో అగ్నిప్రమాదం సృష్టించారని తేలింది. 

ALSO READ : మొగుడి నాలుకను పళ్లతో కొరికి విసిరేసిన భార్య..!

సీనియర్ అధికారిణి అయిన కళ్యాణి నంబిపై ఆమె సహోద్యోగి రామ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని విచారణలో బయటపడింది. నిందితుడు రామ్ తన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దిగ్భ్రాంతికరఘటనతో ఎల్ ఐసీ  సిబ్బంది షాక్ అయ్యారు. ఎల్ ఐసీ లో అసిస్టెంట్  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న నిందితుడు రామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ ఘటన డిసెంబర్ 2025లో మధురైలోని వెస్ట్ పెరుమాల్ మేస్ట్రీ స్ట్రీట్ లోని LIC ఆఫీసులో జరిగింది. మొదట్లో ఎయిర్ కండిషనర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావించినా.. ఈ ఘటనపై అనుమానం ఉన్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. 

ఈ సంఘటన డిసెంబర్ 2025లో మధురైలోని వెస్ట్ పెరుమాళ్ మేస్త్రీ స్ట్రీట్‌లోని LIC కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు నివేదించబడింది. మొదట్లో, అందరూ దీనిని ఎయిర్ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్ అని భావించారు, కానీ ఇప్పుడు ఇది దారుణ హత్య అనే నిజం బయటపడింది.

ALSO READ : హైదరాబాద్ మీర్ పేట్ లో .. 

ఎందుకు హ్యత చేశాడంటే.. 

కళ్యాణి నంబి ఇటీవల తిరునెల్వేలీ నుంచి మధురైకి బ్రాంచి బదిలీ అయ్యారు. మధురై బ్రాంచిలో ఎల్ ఐసీ పాలసీల సెటిల్ మెంట్ లో అక్రమాలు జరిగా యని ఆమె గుర్తించారు. నిందితుడు రామ్ పై ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తానని హెచ్చరించింది. పక్కాప్లాన్ తో కళ్యాణి నంబి ని చంపాలని ప్లాన్ చేశాడు. 

 పెట్రోల్ పోసి నిప్పింటించి కళ్యాణి నంబిని హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు నిందితుడు. ఎల్ ఐసీ ఆఫీసు లో కరెంట్ తీసేసి..మెయిన్ డోర్ మూసి కళ్యాణి నంబిని గదిలో బంధించి బాటిల్ లో తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పింటించాడు. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు తనపై కూడా పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. అయితే స్వల్పగాయాలతో బయటపడ్డాడు. 

ALSO READ : PF ఖాతాదారులకు గుడ్ న్యూస్..

ప్రస్తుతం నిందితుడు రామ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేశారు పోలీసులు.