PF ఖాతాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ విత్ డ్రా విధానంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక మార్పులు తీసుకొస్తుంది. పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ఫ్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ లో అనేక మార్పులు చేస్తోంది.ఈక్రమంలో EPFO 3.0 కు సంబంధించి కీలక అప్డేట్స్ అందించింది.
EPFO 3.0 అనేది ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్‌లో రాబోయే పెద్ద అప్‌డేట్.పీఎఫ్ ను ATMలు ,UPI ద్వారా తక్షణ విత్‌డ్రాలు, కొత్త డిజిటల్ పోర్టల్,ఈజీ క్లెయిమ్ ప్రాసెసింగ్, AI సాధనాలతో సేవలు లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ATM, UPI ల ద్వారా డబ్బును వెంటనే విత్ డ్రా చేసుకోవచ్చు. కొత్త డిజిటల్ పోర్టల్ ద్వారా మెరుగైన ఆన్ లైన్ సేవలను, లాంగ్వేజ్ ట్రాన్స్ లేట్ సాధనాలతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుతాయి. భాషిణి అనే AI పరికరంతో ప్రాంతీయ భాషల్లో సమాచారం పొందవచ్చు. అంతేకాకుండా మ్యాన్యువల్ ఆమోదం లేకుండానే త్వరగా క్లెయిమ్ లు పరిష్కరించుకోవచ్చు.
ALSO READ : వీకెండ్ ఆఫీసుకు రాలేదని.. ఉద్యోగిని పీకేసిన స్టార్టప్ కంపెనీ
EPFO 3.0 వీటితోపాటు సర్వీస్ పీరియడ్ తగ్గించడం, విత్‌డ్రా పరిమితులు సడలించడం వంటి నిబంధనల సవరణలు కూడా ఉండనున్నాయి. ఉద్యోగం లేకున్నా, పెళ్లి, ఎడ్యుకేషన్ వంటి అవసరాలను విత్ డ్రా రూల్స్ సవరించారు. EPF పెన్షన్ వెయిటింగ్ పీరియడ్ ను 36 నెలలకు పెంచారు. గిగ్ , ప్లాట్ ఫాం వర్కర్లకు కూడా పీఎఫ్ సౌకర్యం విస్తరించింది.
ప్రావిడెంట్ ఫండ్ సేవలను బ్యాకింగ్ తరహాలో అందించడం, ప్రాంతీయభాషలలో సేవలు, వేగంగా, స్కేలబుల్ గా మార్చడం EPFO 3.0 లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుత ఖాతాదారులు, రాబోయే సంవత్సరాల్లో ఖాతాదారులుగా చేరే లక్షలాది మంది ఖాతాదారులకు సేవలను గణనీయంగా మెరుగుపర్చనుంది.
