రథ సప్తమి .. సూర్యభగవానుడి పుట్టిన రోజు.. శుభముహూర్తం.. ప్రాముఖ్యత .. విశిష్టత ఇదే..!

రథ సప్తమి  .. సూర్యభగవానుడి పుట్టిన రోజు..  శుభముహూర్తం.. ప్రాముఖ్యత .. విశిష్టత ఇదే..!

హిందువులు పండుగలకు .. పర్వదినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మాఘమాసం కొనసాగుతుంది. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టిన రోజు మాఘమాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రథసప్తమి జనవరి 25న వ తేదీన వచ్చింది. రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ...  నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి . అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.   హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రహ్మ ముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ALSO READ : వసంతపంచమి .. చదువుల తల్లి పండుగ ఎప్పుడు.. సరస్వతిదేవి పూజకు శుభముహూర్తం ఇదే..!

రథ సప్తమి శుభ ముహూర్తం 

హిందూ పంచాగం ప్రకారం ఈ సంవత్సరం  ( 2026) మాఘ శుక్ల సప్తమి తిథి  జనవరి 25వ తేదీన తెల్లవారుజామున 12:39 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అదే రోజు జనవరి 25వ తేదీన రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం రథ సప్తమి 2026 పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు.  రథసప్తమి రోజు పవిత్ర స్నానం చేయడానికి ఉదయం 5:26 గంటల నుంచి 7:13 వరకు శుభ సమయం ఉంటుంది

 రథసప్తమి రోజున సూర్యభగవానుడిని స్మరించుకుంటారు.  దీనిని  సూర్య జయంతి అని కూడా అంటారు.   సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు,  కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు  అన్ని జీవులకు ప్రాణ ప్రదాత.  సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.

ALSO READ : వందేళ్ల తరువాత మకరంలోకి మూడు పవర్ ఫుల్ గ్రహాలు..

రథ సప్తమి రోజు ఏమేమి చేయాలంటే..

రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, తర్వాత రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు మగవారు... ఏడు చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి.
రథ సప్తమి నాడు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి.
 తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవుపేడతో అలికి పద్మం వేసి, పొయ్యి పెట్టి ఆవుపాలు పొంగించాలి.
పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం వేయాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేయాలి.
తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు ఆకులతో రథం చేయాలి. ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి.
ఇలా వీలుకాకపోతే గ్యాస్ స్టవ్ పైన అయినా నైవేద్యం వండి సమర్పించవచ్చు. ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుందని పండితులు చెబుతున్నారు.

ALSO READ : మూలలు పెరిగిన స్థలం కొనవచ్చా.. 

పూర్వకాలంలో చాలామంది ఉదయం సూర్య దేవుడిని పూజించేవారని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది.   స్నానం చేసిన తరువాత సూర్య నమస్కారాలు చేసేవారు. రథ సప్తమి రోజుఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని పండితులు అంటున్నారు. 

రథ సప్తమి (జనవరి 25న)  నాడు సూర్య స్నానాలు చేయాలి.  సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించాలి.  భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.  సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి. అప్పుడే చేసిన  పూజకి ఫలితం ఉంటుంది. 

రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య దేవుడిని పూజించాలి. ముందుగా రాగిపాత్రతో అర్ఘ్యం ( నీళ్లను) సమర్పించాలి. ఆ తర్వాత సూర్య దేవుని ఆరాధించి.. సూర్య మంత్రం, సూర్య చాలీసా పఠించాలి. ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇవ్వాలి. దీంతో పాటు నీరు, వివిధ రకాలు అన్ని కూడా సూర్యునికి సమర్పిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శారీరక, మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు