ఇల్లు కట్టుకోవాలన్నా.. ఇంటి స్థలం కొనాలన్నా.. వాస్తును పాటించాలి. అయితే తరచుగా చాలామందిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. కొన్ని స్థలాలు కొన్ని మూలలు పెరుగుతాయి.. మరి కొన్ని స్థలాలకు రెండు వైపులా రోడ్లు ఉంటాయి.. అలాంటి స్థలాలు కొనవచ్చా.. కొంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. వాస్తు ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . .!
ప్రశ్న: మేము మా ఇంటి పక్కనే కొంత స్థలం కోనాలనుకుంటున్నాం. కానీ అది దీర్ఘచతుర స్రాకారంలోనే ఉన్నా... ఆగ్నేయ మూల కొంచెం ఎక్కువుగా ఉంది. మా ఇంట్లో వాళ్లు ఫర్వాలేదు తీసుకోమంటున్నారు... మరికొందరేమో అసలు మూల పెరిగిన స్థలమే కొనుగోలు చేయొద్దంటున్నారు. మొత్తానికి ఏ మూల పెరిగితే మంచిది? అసలు మూల పెరిగిన స్థలం కొనడమే అరిష్టమా? ఇప్పుడు మేం స్థలాన్ని కొనాలా? వద్దా?
జవాబు: మూల పెరగడం మంచిది కాదనేది నిజమే. కానీ ఈశాన్యం మూల పెరిగితే మంచిది. మీరు చూసిన స్థలంలో ఆగ్నేయ మూల ఎక్కువగా ఉందన్నా రు. దానివల్ల బాధలే తప్ప సంతోషం ఉండరు. ఒకవేళ కొనేసి ఉంటే... పరిష్కారం చూసుకోవాలి ఇంకా కొనలేదు కాబట్టి దాన్ని వదులుకోవడమే మేలు.
ముఖ్యంగా ఆగ్నేయంలో పెరిగితే ఇంట్లో ఆడవాళ్లకు మంచిది కాదు. ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే 'ఎప్పుడో కొన్నాం. ఇల్లు కట్టుకున్నాం కదా పరిష్కారం ఏంటని అడుగుతారు చాలామంది. ఈశాన్యం కాకుండా వేరే మూల పెరిగితే ఆ స్థలంలో మట్టి వేసి ఏదైనా మొక్క నాటాలి. ఆ మూలను విధంగా వాడొద్దు. వీలైనంత వరకు మూలలు పెరిగిన (ఈశాన్యం మినహా) మిగిలిన స్థలాల్లో ఇల్లు కట్టొద్దు. కేవలం చతురస్రం, దీర్ఘచతురస్రాకారంలోనే కట్టాలి.
ప్రశ్న: సిటీకి కొంత దూరంలో స్థలం కొనాలనుకుంటున్నాం. వంద గజాల స్థలాన్ని ఇటీవలే చూశాం. మా ఇంట్లో వాళ్లందరికీ బాగా నచ్చింది. కాకపోతే స్థలానికి రెండు రోడ్లు ఉన్నాయి. అలా ఉంటే మంచిదేనా? ఉంటే దిక్కున ఉండే రోడ్లు మంచివి.
జవాబు: ఏ స్థలం లేదా ఇంటికైనా ఒకటి లేదా రెండు రోడ్లు ఉంటే శుభమే జరుగు తుంది. కానీ మూడు రోడ్డ ఇల్లు మాత్రం వందలో తొంబై శాతం మందికి కలిసిరా దు. వీలైనంత వరకు అలా ఉన్న మీరు రెండు రోడ్లు అని చెప్పారు కానీ, ఎటువైపు ఉన్నాయో చెప్పలేదు. సాధారణంగా తూర్పు, ఉత్తరం దిక్కున రోడ్డు ఉంటే మంచిది. తూర్పు, దక్షిణం వైపున రోడ్డు ఉంటే మాత్రం వాస్తు దోషాలు ఉంటాయి.
