బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 25.
ఖాళీలు: 600. తెలంగాణ రాష్ట్రంలో 17 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అప్రెంటీస్ సంబంధిత రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంత స్థానిక భాషలో (చదవడం, రాయడం, మాట్లాడటం) ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి (2025, నవంబర్ 30): 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 15.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100. పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జనవరి 25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, 12వ తరగతి/ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు bankofmaharashtra.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
