ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ (ఐఐఎస్డబ్ల్యూసీ) యంగ్ ప్రొఫెషనల్-II, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ, బి.టెక్./ బీఈ, ఎం.టెక్./ ఎంఈ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్- ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఖాళీలు: 03.
యంగ్ ప్రొఫెషనల్–-II 02,
ప్రాజెక్ట్ అసిస్టెంట్ 01.
ఎలిజిబిలిటీ
యంగ్ ప్రొఫెషనల్ -II: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
ప్రాజెక్ట్ అసిస్టెంట్: వ్యవసాయం / సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బి. టెక్. పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 50 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మార్చి 30.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు www.cswcrtiweb.org వెబ్సైట్ను సందర్శించండి.
