కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ), జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1,100 పోస్టులు.
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఓ).
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.వ్యవసాయం, ఉద్యానవనం, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ వంటి విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ (బీఎస్సీ, బీఈ/ బి.టెక్.) పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
గమనిక: మూడేళ్ల డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.
వయోపరిమితి: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 8.
చివరి తేదీ: మార్చి 19.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ , ఎస్టీ , పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ.250. ఇతర అభ్యర్థులకు రూ.1050.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.idbi.bank ను సందర్శించండి.
పరీక్ష విధానం
ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టులకు నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్ ప్యాటర్న్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు
- జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ (కంప్యూటర్ ఐటీతో కలిపి) 60 ప్రశ్నలు 60 మార్కులు
- నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
- పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
