IDBI బ్యాంక్‌లో 200 ఖాళీ పోస్టులు.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే..

IDBI బ్యాంక్‌లో 200 ఖాళీ పోస్టులు.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే..

ఐడీబీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్- ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 200. అసిస్టెంట్ మేనేజర్ - గ్రేడ్– ఏ.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.

వయోపరిమితి (2026, మార్చి 1 నాటికి): 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 08.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250. ఇతర అభ్యర్థులకు రూ.1,050.

లాస్ట్ డేట్: మార్చి 19. 

ఆన్‌లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం): ఏప్రిల్ 12.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in ను సందర్శించండి. 

సిలబస్ 
 రీజనింగ్: పజిల్స్ , సీటింగ్ అరేంజ్​మెంట్, కోడింగ్-–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం, డైరెక్షన్స్.
డేటా అనాలిసిస్: పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, టేబుల్స్.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
నంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్.
అర్థమెటిక్ టాపిక్స్: శాతాలు లాభనష్టాలు, వడ్డీ, సగటు, నిష్పత్తి-–అనుపాతం, కాలము–-దూరము.

ఇంగ్లిష్ లాంగ్వేజ్
రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్స్, ఫిల్లర్స్.
బ్యాంకింగ్ అవేర్నెస్ & కంప్యూటర్స్
బ్యాంకింగ్: ఆర్​బీఐ విధులు, ద్రవ్యోల్బణం, బడ్జెట్, మానిటరీ పాలసీ, బ్యాంకింగ్ టెర్మినాలజీ.
కరెంట్ అఫైర్స్: గత 6  నెలల జాతీయ, అంతర్జాతీయ వార్తలు, అవార్డులు, క్రీడలు.
కంప్యూటర్స్: హార్డ్​వేర్, సాఫ్ట్​వేర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్.

ఆన్‌లైన్ పరీక్షా విధానం 
ఐడీబీఐ బ్యాంక్  ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. పరీక్షను 2 గంటల (120 నిమిషాలు) వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో సెక్షనల్ టైమింగ్ ఉండదు. అంటే మీరు మీకు నచ్చిన సెక్షన్‌ను ముందుగా రాసుకోవచ్చు. నెగటివ్ మార్కింగ్ ఉన్నది.  ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ సెక్షన్ మినహాయించి ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కనీస కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.