స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

హైదరాబాద్: విద్యాశాఖపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. స్టూడెంట్స్ కి మరింత మంచి ఫ్యూచర్ అందించే దిశగా కేబినెట్ సబ్ కమిటీలో చర్చించామన్నారు. విద్యా శాఖ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. ‘మన ఊరు మన బడి’ కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి కేసీఆర్‌ రూ.7 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. జూన్ 12 నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభ కానుందని తెలిపిన ఆమె... ఈ అకడమిక్ ఇయర్ నుంచే 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం...

రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ