హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ

ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చెందిన రూ.7 కోట్ల  27 లక్షల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు రావడంతో ఈడీ స్పందించి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ను ఈడీ విచారిస్తున్న సమయంలో జ్వాకెలిన్ ఫెర్నాండెజ్ తో సంబంధాలు బయటపడ్డాయి. 
జాక్వెలైన్ తీసుకున్న కొన్ని ఫిక్స్ డ్ డిపాజిట్  కు చెందిన 7 కోట్ల 27 లక్షల విలువైన ఆస్తులను ఈడీ ఇవాళ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో 7 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లేనని తెలుస్తోంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఖరీదైన వజ్రాలు, చెవిపోగులు, బ్రాస్ లెట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. తాను చంద్రశేఖర్ నుంచి కొన్ని బహుమతులు తీసుకున్నది నిజమేనని ఈడీ అధికారుల ఎదుట జాక్వెలిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో వాటిని ఈడీ సీజ్ చేసినట్లు సమాచారం. 

 

ఇవి కూడా చదవండి

చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి

సొంత పార్టీ మేయర్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్

చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా?

మాదేమైనా ఏపీలో అపోజిషన్ పార్టీనా?