ఆఫర్లతో జనాలను ఆకట్టుకుంటున్న బేకరీలు

ఆఫర్లతో జనాలను ఆకట్టుకుంటున్న బేకరీలు

న్యూఇయర్ వేడుకలకు మహానగరం ముస్తాబవుతోంది. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒకరు  హ్యాపీ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కేక్ కటింగ్ తో నే ప్రారంభంకానున్నాయి. దీంతో సిటీలో వివిధ రుచులతో కేక్స్ నోరూరిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ జనాలను ఆకట్టుకునేందుకు బేకరీలు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

ఈ సారి గతం కంటే మంచి సేల్స్  ఉన్నాయని చాక్ లెట్ , వెనీలా, స్ట్రాబెర్రీ, చెర్రీస్ , కూల్  కేక్ లు యూత్ ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాక  రౌండ్ , కోన్ , కార్టూన్  బొమ్మల కేకులు చిన్న పిల్లలను  ఆకట్టుకుంటున్నాయి.  న్యూ ఇయర్  అనగానే కేక్ మేకింగ్ తో బెకెర్స్ బిజీగా కనిపిస్తున్నారు. కప్ కేక్స్ లో కూడా ఈ సారి మంచి  థీమ్ తో చాలా రకాల వెరైటీలు చేశామని అంటున్నారు బేకారి నిర్వాహకులు. 

రెగ్యులర్ గా ఉండే కెక్స్ తో పాటు  వెరైటీ డిజెన్స్ లో కెక్స్ ను రెడీ చేస్తున్నారు చెఫ్స్..  కిలో కేక్  ధర 500 వందల నుంచి 4000 వరకు ఉంటుంది.  కొందరు  తమ ఇంట్లో కేక్ కట్ చేయడం తో పాటు తమకు తెల్సిన వారికీ కూడా ఇవ్వడం ఒక సెంటిమెంట్ గా చెపుతున్నారు పబ్లిక్.. పోయిన రెండు సంవత్సరాలు కోవిడ్ కారణంగా వేడుకలకు దూరంగా ఉన్న వారు కూడా ... ఈ ఏడాది గ్రాండ్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటామని చెపుతున్నారు.