
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పీఎం మోడీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఇతర ప్రముఖులు హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. అలాగే హెచ్ఐసీసీ మాదాపూర్, జూబ్లీ చెక్ పోస్ట్, రాజ్ భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్ పోర్ట్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్ కు అనుమతి లేదు. అదే విధంగా టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు నో ఎంట్రీ విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.