సీఎం కప్‌‌‌‌ స్టేట్‌‌‌‌ పోటీలు షురూ.. పోటీల్లో 7 వేలకు పైగా క్రీడాకారులు

సీఎం కప్‌‌‌‌ స్టేట్‌‌‌‌ పోటీలు షురూ.. పోటీల్లో 7 వేలకు పైగా క్రీడాకారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  సీఎం  కప్‌‌‌‌ స్టేట్‌‌‌‌ లెవెల్‌‌‌‌  పోటీలు ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో షురూ అయ్యాయి. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో ఆటలు హోరాహోరీగా జరుగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో  క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌, శాట్స్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ ఆంజనేయ గౌడ్‌‌‌‌ పోటీలను ప్రారంభించారు. ఇకపై ప్రతీ ఏటా సీఎం కప్​ ఉంటుందని శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ తెలిపారు. మట్టిలో మాణిక్యా లను గుర్తించి వారి ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో పాటు  రాష్ట్రవ్యాప్తంగా క్రీడా చైతన్యాన్ని వెల్లివిరిసే దిశగా సీఎం కప్‌‌‌‌ను నిర్వహిస్తున్నామని ఆంజనేయ గౌడ్‌‌‌‌ చెప్పారు. మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి, రాష్ట్ర స్థాయికి ఎంపికైన దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వాళ్లందరికి ఉచిత భోజన, వసతి కల్పించామన్నారు.