కాంగ్రెస్ చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేయండి

కాంగ్రెస్ చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేయండి

రాజస్థాన్ : కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘చింతన్ శిబిర్ ’ నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు (13, 14, 15వ తేదీల్లో ) సమావేశాలు జరగనున్నాయి. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ బలపడేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. 

తొలిరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బీజేపీపై మండిపడ్డారు. గాంధీ హంతకులను బీజేపీ ఆరాధిస్తోందని, మైనార్టీలను చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల వల్ల దేశానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.

చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పలు తీర్మానాలు చేసింది. ఒకే కుటుంబానికి ఒక టికెట్ ఇవ్వాలని, యువతకు పెద్దపీట వేయాలని, పార్టీలో అనేక సంస్కరణలు తీసుకురావాలని చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అగ్ర నాయకత్వం తరలివచ్చింది. వీరితో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ సహా ప్రముఖ నేతలు హాజరయ్యారు.

ఈ సమావేశంలో 400 మంది కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా సమావేశానికి వచ్చారు.

మరిన్ని వార్తల కోసం..