పిటిషనర్‌ కు ఇస్తున్న రక్షణపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

పిటిషనర్‌ కు ఇస్తున్న రక్షణపై వివరణ ఇవ్వండి : హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌–1 పరీక్షల్లో అవకతవకలపై న్యాయ పోరాటం చేస్తున్న పిటిషనర్‌కు బెదిరింపులు వస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. పిటిషనర్‌కు ఇస్తున్న రక్షణపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2023 గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో అవకతవకలపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు ఇటీవల సదరు పరీక్షలు రద్దు చేసింది.

దీంతో తనకు బెదింపులు వస్తున్నాయంటూ పిటిషనర్‌ బి.నర్సింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్‌ తుకారాం జీ సోమవారం విచారించారు. పిటిషనర్ న్యాయవాది వాది స్తూ.. పిటిషనర్‌కు బెదిరింపులు ఎక్కవ య్యాయని కోర్టుకు చెప్పారు.

బెదిరింపులు సోషల్‌ మీడియాలో వచ్చాయన్నారు. పిటిషనర్‌కు పాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది.