రెమ్యునరేషన్ పెంచితేనే షూటింగ్లు

రెమ్యునరేషన్ పెంచితేనే షూటింగ్లు

ఫిల్మ్ ఛాంబర్ కు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కు మధ్య వివాదం ముదురుతోంది. వివాదం కారణంగా టాలివుడ్ లో షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈరోజు నుంచి షూటింగ్ లలో పాల్గొనకుంటే ఆరు నెలల పాటు షూటింగ్ నిలిపివేస్తామని ఫిల్మ్ చాంబర్ తెలిపింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న 28 షూటింగ్ లు బంద్ అయ్యాయి. నిర్మాతలెవరు కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావద్దని ఫిల్మ్ చాంబర్ కోరింది. అయితే ప్రస్తుతం ఉన్న రెమ్యునరేషన్ కంటే 45శాతం ఎక్కువ ఇవ్వాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. వేతనాలు పెంచేంత వరకు ఘూటింగులకు హాజరవ్వమని ఫెడరేషన్ సభ్యులు చెబుతున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టపోయేది నిర్మాలేనని తెలిపారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలని కోరారు.