దేశంలోనే ఫస్ట్‌ కార్గో ఎక్స్‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌

దేశంలోనే ఫస్ట్‌ కార్గో ఎక్స్‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌

హైదరాబాద్‌, వెలుగు: దేశంలోనే మొట్టమొదటి కార్గో ఎక్స్ ప్రెస్ రైలును సౌత్ సెంట్రల్ రైల్వే నడపనుంది. దేశవ్యాప్తంగా సరకు రవాణా అభివృద్ధికి చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదటి 6 నెలల కాలానికి ఈ రైలు ప్రారంభించనున్నారు. ప్రతి బుధవారం హైదరాబాద్నుంచి న్యూఢిల్లీకి ఈ రైలు బయలుదేరనుంది. గూడ్స్ రైళ్లలో ఒకే రకమైన సరకును లోడ్‌ చేసేవారు. చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ఉపయోగపడేలా కనిష్ట స్థాయిలో ఒక వ్యాగన్‌ సరుకును రవాణా చేయవచ్చు. ఒక వ్యాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 టన్నుల సరకును బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు.

కార్గో ఎక్స్ ప్రెస్ యావరేజ్ స్పీడ్ గంటకు 50 కి.మీ. కాగా సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు 1,700 కి.మీ. దూరాన్ని కేవలం 34 గంటల్లోనే చేరుతుంది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రవాణా సగటు చార్ టజీ న్నుకు రూ.2,500గా నిర్ణ‌యించారు. సరుకు రకాన్ని బట్టి చార్జీ మారుతుంది. బుకింగ్‌కు 9701371976, 04027821393 నంబర్లలో లేదా https://scr.indianrailways.gov. in/cargoexpress లో సంప్రదించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యా కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం