అనవసర స్కీముల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దు

అనవసర స్కీముల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దు

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో అవసరమైన సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేయాలని, అంతగా అవసరం లేని స్కీముల కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ర్టాన్ని మరింత అప్పులు పాలు చేయొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్​జీజీ)  ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడు చేస్తున్న అప్పులు భవిష్యత్ తరాల వారికి గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్ కు ఎఫ్ జీజీ సెక్రటరీ పద్మనాభ రెడ్డి గురువారం లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఎక్కువ నిధులు విద్య, వైద్యానికి కేటాయించాలని పేర్కొన్నారు. హైపర్ పాపులిస్టు సంక్షేమ పథకాలతో కొన్ని దేశాలు అప్పుల పాలవడంతో పాటు అల్లర్లు, అశాంతి నెలకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.