పదేండ్లలో తొలిసారి ఇలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

పదేండ్లలో తొలిసారి ఇలా  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత పదేండ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని, రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించింది. 

పదేండ్లలో తొలిసారి ఇలా..

గత ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా పదేండ్లలో ఒక్కసారి కూడా ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఉద్యమకారులందరికీ ఆహ్వానం పంపుతున్నది. ఆవిర్భావ వేడుకల్లో ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్​లో పోలీసుల కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, సోనియా గాంధీ మాట్లాడతారు. సాయంత్రం ట్యాంక్​బండ్​పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్నివాల్, లేజర్ షో లాంటి కార్యక్రమాలతో పాటు ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.