పెళ్లి కోసం ఒక్క అబద్ధం.. నిజం తెలిసి చావకొట్టారు.. చేసిన తప్పేంటీ

పెళ్లి కోసం ఒక్క అబద్ధం.. నిజం తెలిసి చావకొట్టారు.. చేసిన తప్పేంటీ

పెళ్లి కోసం వంద అబద్ధాలైనా ఆడమన్నారు... అనేది సామెత. ఇది ప్రస్తుత పరిస్థితి లోనూ తప్పడం లేదు. వయసు దాచేవారు కొందరైతే.. ఉద్యోగం గురించి తప్పు సమాచారం ఇచ్చేవారు.. ఆదాయం పై బొంకేవారు.. ఆస్తుల విషయం లో అబద్ధాలు చెప్పేవారు.. ఇలా.. అనేకానేక అబద్ధాలు పెళ్లి మండపం సాక్షిగా ఖర్చయిపో తూనే ఉన్నాయి. తర్వాత.. నిజాలు తెలిసినా.. అందరూ సర్దుకుపోతున్నారు.

కానీ తాజాగా జరిగిన ఓఘటన లో వరుడు వంద కాదు కానీ.. ఒకే ఒక్క అబద్ధం చెప్పాడు. అది అంత తేలికగా.. బయట పడదులే అనుకున్నాడో ఏమో.. కానీ..అసలు దాచాలంటే దాగని అబద్ధం ఆడేసి.. అడ్డంగా దొరికి పోయాడు. అంతే.. పెళ్లి కుమార్తె తరఫు వారు ఊరుకుంటారా.. చితకబాదేశారు  అయ్యో.. కుయ్యో.. అంటూ.. చేసిన తప్పును ఒప్పుకొన్నా వదిలి పెట్టలేదు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

పూర్వం రోజుల్లో ఎప్పుడో వృద్ధులయ్యాక బట్టతలలు వచ్చేవి. ఇప్పుడు చిన్నతనంలోనే బట్టతల వస్తోంది. వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. దీంతో పెళ్లి కావడమే కష్టంగా మారుతోంది. బట్టతల ఉంటే డబ్బున్న వాళ్లయితే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. కొందరేమో విగ్గులు వాడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ పెళ్లికొడుకు బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా విషయం తెలియడంతో చితకబాదారు.

ఇంతకీ అతగాడు చేసిన తప్పు.. బట్టతల ను దాచి.. పెళ్లి కుమార్తెకు వలవిసరడమే. బిహార్లోని గయా జిల్లాలో ఓ వ్యక్తి(40 ఏళ్లు) రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సరే అనుకున్నారు పెళ్లి కుమార్తె బంధువులు. కారణం ఏదైనా.. రెండో పెళ్లివాడైనా ఫర్వాలేదనుకున్నారో ఏమో.. ఇక ఈయనకు పెద్ద బట్టతల ఉంది. కానీ.. ఈ విషయాన్ని మాత్రం దాచేశాడు.  తనకు బట్టతల ఉందన్న విషయాన్ని దాచి.. విగ్గు ధరించి పెళ్లి మండపానికి వచ్చాడు.

పంతులు గారు మంత్రాలు చదివేస్తున్నారు. కొద్ది సేపట్లో  తాళి కట్టాల్సి ఉందనగా.. ఆ సమయం లో ఈ విగ్గు విషయం వధువు బంధువుల కు తెలిసిపోయింది. అంతే.. ఇంకేముంది..  ఆగ్రహించిన వధువు బంధువులు.. అతడి ని చితకబాదారు. తాను చేసింది తప్పే.. వదిలేయాలంటూ నిందితుడు ప్రాధేయప డ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మొదటి భార్య ఘటనా స్థలానికి వచ్చి.. మరో రెండు తగిలించింది. ఆతరువాత ఇదంతా మొదటి భార్య దగ్గరుండి వీడియో తీయడం గమనార్హం. అటు పరువు పోయి ఇటు పెళ్లి ఆగిపోయినందుకు వరుడు తెగ బాధపడ్డాడు. బట్టతల విషయం దాచిపెట్టి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పెళ్లి చూపుల్లోనే తనకు బట్టతల ఉందని ఒప్పుకుంటే పోయేది కదా

ఇలా చాలా మంది బట్టతలతో బాధపడుతున్నారు. తమ అనారోగ్య కారణాలతో వెంట్రుకలు ఊడిపోవడం తమ తప్పు కాదని తెలిసినా ఫలితం మాత్రం వారే అనుభవిస్తున్నారు. సినిమా వాళ్లకే తప్పని బట్టతల బాధలు మనకెందుకు అని తెగ బాధపడుతున్నారు. నిజం ఒప్పేసుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు. మొత్తానికి వరుడి పరువు గంగలో కలిసింది.  ఇదీ.. సంగతి.. ఒకే ఒక్క అబద్ధం.. తెచ్చిన తంటాతో.. కటకటాల్లో పడ్డాడు రెండో పెళ్లి కుమారుడు.