
హైదరాబాద్, వెలుగు: ఆయుష్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుసరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఇన్ సర్వీసులో ఉన్నవాళ్లను నియమించేందుకు వీలుగా రూల్స్ మార్చడం కరెక్ట్ కాదంది. ఇందుకు జారీ చేసిన జీవో 71 అమలును నిలిపేస్తూ స్టే ఆదేశాలిచ్చింది. ఆయుష్‌లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ ఆయుర్వేద డాక్టర్లు వేసిన రిట్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీబీ భాస్కర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. జీవో అమలును నిలిపివేస్తూ.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.