- వైన్స్ దుకాణాలకు 19 వేల అప్లికేషన్లు
- దరఖాస్తు గడువు పొడిగించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వైన్స్‌లకు ఇప్పటివరకు 19 వేల దరఖాస్తు లు వచ్చాయి. మొత్తం 2,620 వైన్స్‌లకు గాను యావరేజ్‌గా ఒక్కో వైన్స్‌కు 7 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో అప్లి కేషన్‌కు రూ.2 లక్షల నాన్ రిఫండ బుల్ ఫీజుగా నిర్ణయించడంతో అప్లికేషన్ల ద్వారా రూ.380 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల గడువు గురువారంతో ముగియ నుంది. 20న ఆయా జిల్లాల్లో లక్కీ డ్రా తీయనున్నారు. పోయినసారి మాత్రం వైన్స్‌కు 49 వేల అప్లికేషన్లు వచ్చాయి.
ఎక్సైజ్ పాలసీలో ఈసారి కొన్ని వెసులుబాట్లు కల్పించినా, ఆబ్కారీ శాఖ ప్రచారం చేసినా వ్యాపారులు ఇంట్రస్ట్చూపించ లేదు. వాస్తవానికి ఈసారి 404 వైన్స్‌కు కొత్తగా పర్మిషన్ ఇవ్వడంతో రూ. 1,200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ అందులో సగం కూడా రాకపోవడంతో అప్లికేషన్ల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది.
